Tollywood news in telugu

”రాయలసీమ లవ్ స్టోరీ ” ట్రైలర్ రిలీజ్

ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ”రాయలసీమ లవ్ స్టోరీ ”. వెంకట్ ,హృశాలి గోసవి ని  హీరోహీరోయిన్లుగా  పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రంలో  పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . తాజాగా   షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ  చిత్రాన్ని సెప్టెంబర్ 20 న రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు  చేస్తోంది . కాగా ఈ నెల 27 న రిలీజైన  ట్రైలర్  డిజిటల్  మీడియాలో మంచి  ఆదరణ పొందుతుంది  .  నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button