అల్లం చాయ్ అమ్మి 227 కోట్లు సంపాదించింది .

Realstory of allam tea vendor: ఇండియాలో గల్లీ గల్లీ కి దొరికే అల్లం చాయ్ ఇక్కడ పెద్ద డిమాండ్ లేకపోవచ్చు , టీ అమ్ముతూ ధనవంతులుగా కావటం అనేది ఎపుడు వినని సంఘటన , కానీ అల్లం చాయ్ అమ్మి కోట్లు సంపాదించింది ఒక యువతి.
అమెరికా కొలరాడోకు చెందిన “బ్రూక్ ఎడ్డీ” అనే మహిళా మహారాష్ట్ర పర్యటనలో “స్వాధ్యాయ్ పరివార్ అనే ప్రోగ్రామ్” కోసం వచ్చినపుడు అల్లం టీ టేస్ట్ చేసిందట తనకు విపరీతం గా నచ్చిందట , అలాగే తాను మల్లి అమెరిక వెళ్ళినపుడు అక్కడ ఉన్న కాస్టలీ హోటల్ లో కూడా అల్లం చాయ్ టేస్ట్ చేసిందట అయితే అవేవి ఇండియా టీ టేస్ట్ కి దరిదాపుల్లో కుడా టేస్ట్ లేకపోవటం తో తనకి ఒక ఐడియా వచ్చిందట.

ఇండియా లో అల్లం చాయ్ తాయారు చెసే మూలికలతో అమెరికాలో టీ తయారు చేసి జనావాసాల్లో తిరిగి టీ అమ్మటం మొదలు పెట్టింది అది అక్కడ ఉన్న జనాలు విపరీతంగా నచ్చి ఫాన్స్ గా మారిపోగానే “భక్తి చాయ్” పేరుతో షాప్ లు ఓపెన్ చేసింది అది సూపర్ గా హిట్ అవటం తో 227 కోట్ల సంపాదన గడించింది , తాను స్వచ్చంధంగా సామాజిక సేవకురాలు కావటం తో అందులో సుమారు 50 కోట్ల వరకు ఇండియాలో ఉన్న పేదలకు సహాయం చేసిందట .