Today Telugu News Updates
Prabhas: కొత్త వరల్డ్ లోకి అడుగు పెట్టబోతున్న డార్లింగ్
బాహుబలి చిత్రంతో రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్… వెనుక సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్, సలార్, రాధేశ్యాం చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ఆది పురుష చిత్రంలో ప్రభాస్ రాముని పాత్ర లో నటించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూడా ఓ ప్రధానమైన పాత్ర పోషించ బోతున్నాడు. ఈ చిత్రానికి ఒం రౌత్ దర్శకునిగా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ పథకం తెరకెక్కిస్తోంది.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ కోసం… అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నామని… తొలిసారి ఆదిపురుషుడు చిత్రంలో ఇంటర్నేషనల్ టెక్నాలజీ చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఆది పురుష చిత్రం కోసం మోషన్ పోస్టర్ టెక్నాలజీ వాడుతున్నామని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది.