Roberrt Movie: ‘రాబర్ట్’ మూవీ ఓటీటీలో ఎప్పుడు సందడిచేయనుందంటే…!

Roberrt Movie: తరుణ్ కిశోర్ సుధీర్ దర్శకత్వం వహించిన మూవీ ‘రాబర్ట్ ‘ . ఈ మూవీలో కన్నడ స్టార్ ‘దర్శన్’ హీరో గా చేశారు. బారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం లో జగతిబాబు, వినోద్ ప్రభాకర్, రవిశంకర్ ముఖ్య పత్రాలు పోషించారు. అర్జున్ జన్య ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పటికి మంచి కలెక్షన్లను రాబడుతుంది.
ఈ సినిమా లో హీరో డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులోని పాటలు వినసొంపుగా ఉండటంతో సంగీత ప్రియులను కట్టిపడేస్తున్నాయి. అలాగే కామెడీ తో పాటుగా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కంటతడి పెట్టించకమానదు.
అదేవిదంగా దర్శన్ రాఘవ ఎక్కువగా దైవభక్తి , శాంతియుతంగా ఉండే వ్యక్తి. అతను లక్నోలో అంత్యక్రియల కార్యక్రమాలకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు సౌత్ క్యాటరింగ్ సర్వీస్ లో కుక్ గా జాబ్ చేస్తాడు. ఇతనికి అర్జున్ అనే కుమారుడు ఉంటాడు. అతను రాఘవకు పూర్తిగా వ్యతిరేకం. అర్జున్ కోపిస్టి, రౌడీగా తయారవుతాడు. అర్జున్ గ్యాంగ్ స్టర్ గా మారి ప్రజలకు ఎన్నో సమస్యలను సృష్టిస్తాడు. ఇక గ్యాంగ్ స్టర్ గా మారిన తన కొడుకును, మంచి వ్యక్తిగా ఎలా మారుస్తాడు అనేదే ఈ సినిమాలో చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
మూడు బాషల్లో తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్లలో విజయవంత ఆడుతుంది. ఈ మూవీని చూడటానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్న… కొంతమంది కరోనా భయంతో చాలా మంది సినిమా థియేటర్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఓటీటీలో విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ మొదటివారంలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. కానీ దీనిపై నిర్మాతలనుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.