Vijay Deverakonda Age – Complete Bio – వాట్సాప్ రౌడీ బాయ్స్

Rowdy Vijay Devarakonda Age: వాట్సాప్ వాట్సాప్ రౌడీ బాయ్స్ అంటూ యువతలందరికి ఒకరకమైన ట్రాన్స్ తీసుకొని పోయి , రెండవ సినిమాకే పెద్ద హీరోల లిస్ట్ లో చేరిన ఒకేఒక హీరో విజయ్ దేవరకొండ.
పెళ్ళి చూపులు సినిమాలో లో ఎంత డీసెంట్ గా కనిపించాడో అర్జున్ రెడ్డి తో కంప్లీట్ చేంజ్ ఓవర్ చేసి బాక్స్ ఆఫీస్ గేమ్ చేంజెర్ అని కొత్త రికార్డు సృష్టించాడు. అప్పటినుంచి ఇప్పటిదాకా అతనికంటూ సెపెరేట్ ఫ్యాన్ బేస్ , రౌడీ బాయ్స్ అంటూ టాగ్ లైన్ ఇలా ఎన్నో కొత్త ట్రెండ్స్ సృష్టించాడు.

అయితే Vijay Devarakonda పుట్టింది పెరిగింది తెలంగాణ లోని అచ్చంపేట లో. ఇతని తల్లిదండ్రులు గోవర్ధన్ రావు మరియు మాధవి. ఇతని తమ్ముని పేరు ఆనంద్ దేవరకొండ. విజయ్ తండ్రి అప్పట్లో సీరియల్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ రాకపోవడం తో ఇండస్ట్రీ ని వదిలేశారు. తల్లి సాఫ్ట్ స్కిల్స్ ట్యూటర్ గా పని చేస్తుంది. తమ్ముడు కూడా జాబ్ మానేసి సినీ రంగం లో అన్న వెళ్ళే దారిలో నడుస్తున్నాడు.
విజయ్ అనంతపూర్ లోని శ్రీ సత్య సాయి హై స్కూల్ లో చదవగా. హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్ లోని బద్రుక కాలేజీ అఫ్ కామర్స్ లో డిగ్రీ పట్టా పొందారు. చదువుతున్న సమయంలోనే సినిమాలో నటించేందుకు అనేక ప్రయత్నాలు చేయగా, మొట్టమొదటి సారి 2011 లో రవి బాబు దర్శకత్వం వహించిన నువ్విలా సినిమాలో ముఖ్యమైన పాత్రలో చేసారు.
ఆలా కొంత కాలం గడిచాక మరల శేఖర్ కమ్ముల గారి దర్శకత్వం లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో కనిపించరు. కానీ విజయ్ కి మంచి గుర్తింపు వచ్చింది మాత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వం వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా.. ఈ సినిమాలో నాని మెయిన్ లీడ్ అయినప్పటికీ విజయ్ పాత్రకే ఎక్కువ ఆదరణ వచ్చింది.
అయితే విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి హీరో గా చేసింది మాత్రం పెళ్లి చూపులు అనే సినిమా. ఈ సినిమా 2016 లో విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి గాని విజయ్ ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్నారు. తర్వాత ద్వారకా అనే సినిమా రిలీజ్ అయినప్పటికీ పెద్దగా అలరించలేకపోయింది. అయితే దీని తర్వాత విడుదలైన అర్జున్ రెడ్డి మాత్రం మొత్తం ఇండస్ట్రీ నే విజయ్ గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ సినిమాకి విజయ్ కి వచ్చిన గుర్తింపు అంత ఇంత కాదు.
ఇలా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ చూస్తూనే ఉన్నారు. గీత గోవిందం టాక్సీ వాలా , నోటా , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా కొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ అయినా టీవీ లో వచ్చేసరికి హిట్ సినిమాలు అని నిరూపించాయి.
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఫ్యాన్ ఇండియా సినిమా లైగర్ తీస్తున్నారు. త్వరలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
పేరు :- Vijay Devarakonda
ముద్దు పేరు :- విజయ్
డేట్ ఆఫ్ బర్త్ :- మే 9, 1989
Vijay Devarakonda Age:- 32
రాశి :- వృషభం
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 9 అంగుళాలు
బాడీ కొలతలు :- 37-28-14
చెస్ట్ - 37
వెయిస్ట్ :- 28
బై సెప్స్ :- 14
తల్లిదండ్రులు :- గోవర్ధన్ రావు దేవరకొండ , మాధవి దేవరకొండ
సోదరి – సోదరులు :- ఆనంద్ దేవరకొండ
స్కూల్ :- శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పుట్టపర్తి.
లిటిల్ ఫ్లవర్ జూనియర్ స్కూల్, హైదరాబాద్.
కళాశాల :- బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ , హైదరాబాద్.
విద్య అర్హత :- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.com)
లొకేషన్ :- అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
ప్రస్తుత నివాసం :- హైదరాబాద్, తెలంగాణ.
ఇష్టమైన రంగు :- నీలం (బ్లూ)
ఇష్టమైన నటుడు :- షారుక్ ఖాన్
ఇష్టమైన నటి :- రాధికా ఆప్టే
ఇష్టమైన ఆహారం :- సౌత్ ఇండియా డిషేస్
హాబీస్ :- ట్రావెలింగ్, మ్యూజిక్ వాయించడం.
మొదటి సినిమా :- నువ్విలా (2011) , ఎవడే సుబ్రమణ్యం (2015)
నోటా (2018, తమిళ్)
రెమ్యునరేషన్ :- 4 కోట్లు (ఒక సినిమా కి )
అవార్డ్స్ :-
- నంది అవార్డ్ కేటగిరీ లో 2015 సంవత్సరం న ఎవడే సుబ్రహ్మణ్యం కోసం ప్రత్యేక జ్యూరీ అవార్డు.
- 2017 లో అర్జున్ రెడ్డి కి జీ గోల్డెన్ అవార్డ్స్ వచ్చింది.
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ కేటగిరీ లో 2018 న ఉత్తమ నటుడు – అర్జున్ రెడ్డి తెలుగు.
- 2019 లో విమర్శకులు ఉత్తమ నటుడు – గీత గోవిందం సినిమాకు వచ్చింది.