Telugu Heroes

Sai Dharam Tej Biograpy, Age, Complete Family Details

Name: Sai Dharam Tej

Sai Dharam Tej (Supreme Hero) Complete Bio: పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో ఇండస్ట్రీ లో కొత్త సినిమాలకు నాంది పలికిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా గా రేయ్ తీసినప్పటికి , మొదటిగా విడుదల అయింది మాత్రం పిల్ల నువ్వు లేని జీవితం.

మొదటి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరో , కట్ చేస్తే సుప్రీమ్ హీరో ట్యాగ్ దక్కించుకున్నారు. ఇలా వరుస సినిమాలతో లైఫ్ బిజీ, బిజీ గా లీడ్ చేస్తున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈరోజు మనం ఇతని గురించి తెలుసుకుందాం.

సాయి ధరమ్ తేజ్ 15 అక్టోబర్ 1986 న డాక్టర్ శివ ప్రసాద్ మరియు విజయ దుర్గ కు పుట్టిన సంతానం. విజయ దుర్గ మరెవరో కాదు స్వయానా మెగా స్టార్ చిరంజీవికి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు నాగ బాబు కి చెల్లి అవుతుంది. సాయి ధరమ్ తేజ్ కి తమ్ముడు కూడా ఉన్నాడు , అతనే మన ఉప్పెన తో ప్రేక్షకులు పరిచయం అయినా వైష్ణవ తేజ్.

Vaishnav Tej (Brother Of Sai dharam Tej )

చిన్నపటినుంచి యాక్టింగ్ చూస్తూ పెరిగి , యాక్టింగ్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు సాయి ధరమ్ తేజ్. ఇదిలా ఉండగా సాయి తేజ్ నలంద స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసుకొని , గ్రాడ్యుయేషన్ సెయింట్ మేరీ కాలేజీ అఫ్ హైదరాబాద్ లో పూర్తి చేసుకున్నారు. ఆలా చదువు పూర్తిచేసుకున్న వెంటనే సినిమా తీయాలని బలంగా ఫిక్స్ అయ్యారు.

అనుకున్నట్లే 2014 ముందే వై.వి. యస్. చౌదరి తో కలిసి రేయ్ అనే సినిమాతో ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ పరిస్థితుల ప్రభావం మేరకు ఈ సినిమా సగం లో ఉండగా తేజ్ రెండవ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా పేరు పిల్ల నువ్వు లేని జీవితం. ఈ సినిమా కూడా సగానికి పైగా తీసాక విలన్ గా చేస్తున్న శ్రీహరి గారు చనిపోవడం తో తేజ్ కెరీర్ డైలమా లో పడింది.

అయినా సరే తేజ్ కి అందరు ధైర్యం ఇయ్యడం తో శ్రీహరి గారి ప్లేస్ లో జగపతి బాబు ని పెట్టి సినిమా అంత మళ్ళీ రీషూట్ చేసారు. రెండవ సినిమా కాస్త మొదటి సినిమా గా విడుదలయి ఇండస్ట్రీ రికార్డ్స్ కోటింది. డెబ్యూ సినిమాతోనే ప్రజలందరి అభిమానాన్ని పొందాడు. దీని తర్వాత రేయ్ సినిమా విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

2015 లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో మరియు సుప్రీమ్ సినిమా తో బ్యాక్ తో బ్యాక్ కమర్షియల్ హిట్స్ కొట్టి సుప్రీమ్ హీరో ట్యాగ్ దక్కించుకున్నారు. సుప్రీమ్ తర్వాత తేజ్ వరుసగా చేసిన 6 సినిమాలు ప్లాప్ అయ్యాయి. అవి తిక్క , విన్నర్ , నక్షత్రం , జవాన్ , ఇంటెలిజెంట్ , తేజ్ ఐ లవ్ యు . ఇలా వరుసగా పరాజయాలు ఎదురవ్వడం తో తేజ్ కెరీర్ మళ్ళీ డైలమా లో పడింది.

ఈసారి చాల జాగ్రత్తగా అలోచించి చిత్ర లహరి సినిమా తీశారు. ఈ సినిమా తేజ్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా గా నిలిచి బాక్స్ ఆఫీస్ హిట్ కోట్టింది. ఈ సినిమా తరవాత తేజ్ మరల సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. చిత్ర లహరి తర్వాత ప్రతి రోజు పండగే , సోలో బ్రతుకే సో బెటర్ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం దేవ కట్ట దర్శకత్వం లో రిపబ్లిక్ సినిమాతో బిజీ గా ఉన్నారు.

sai dharam tej

Name :- Sai Dharam Tej

ముద్దు పేరు :- తేజ్

Date Of Birth :- 15 అక్టోబర్, 1986

Age :- 35 (2021 సంవత్సరానికి )

రాశి :- తుల

Height :- 5 అడుగుల 9 అంగుళాలు.

బాడీ కొలతలు :- 40 – 32 – 12

                    చెస్ట్ - 40
                    వెయిస్ట్ :- 32
                    బై సెప్స్ :- 12

తల్లిదండ్రులు :- డాక్టర్ శివ ప్రసాద్, విజయ దుర్గ

సోదరి – సోదరులు :- వైష్ణవ్ తేజ్

Relations :- Mega Star Chiranjeevi, Pavan Kalyan, Nagababu, Bunny(Allu Arjun), Ram charan , Shirisha, Niharika, Varun Tej మొదలగు.

స్కూల్ :- నలంద స్కూల్

కాలేజ్ :- సెయింట్ మేరీ కాలేజీ అఫ్ హైదరాబాద్

లొకేషన్ :- హైదరాబాద్, తెలంగాణ

ప్రస్తుత నివాసం :- హైదరాబాద్ ,తెలంగాణ

ఇష్టమైన రంగు :- బ్లాక్, వైట్ మరియు బ్లూ.

Favourite Actors :- Chiranjeevi, Pawan Kalyan, Kamal Haasan.

Favourite Actress :- Anushka, Samantha

Favourite Food :- South Indian

హాబీస్ :- క్రికెట్

ఇష్టమైన ప్లేయర్ :- మహేంద్ర సింగ్ ధోనీ

ఇష్టమైన సింగర్ :- శ్రేయ ఘోషల్.

ఇష్టమైన ప్రదేశాలు :- గోవా , దుబాయ్ , ప్యారిస్.

మొదటి సినిమా :- పిల్ల నువు లేని జీవితం ( 2014)

రెమ్యునరేషన్ :- 80 Lakhs పైగా ఒక సినిమాకి

Awards:

  • పిల్ల నువు లేని జీవితం సినిమాకి గాను సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డ్ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button