Tollywood news in telugu
Sai Dharam Tej meets with an accident | సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej accident: సాయి ధరమ్ తేజ్ , మెగా’ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ శుక్రవారం స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు చాలా తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ స్పృహ తప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్ ఉన్నా కుడా ఈ ప్రమాద తీవ్రత వల్ల గాయాలు బలంగా తగిలాయి.
వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ కుడికన్ను, పొట్ట, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మెడికవర్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు.