Sam Bollywood Entry fixed : సమంత బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ ? :-
Sam Bollywood Entry fixed : అదేంటి సమంత ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించేసి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది కదా మరి ఈ కొత్త ఎంట్రీ ఏంటి అని అనుకుంటున్నారా. ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత విలన్ లాంటి రోల్ చేసింది. ఈ పాత్రకు ఎనలేని గుర్తింపు కూడా దక్కించుకుంది.
అయితే ఇప్పుడు సమంత బాలీవుడ్ సినిమాలలో లీడ్ రోల్ చేసేందుకు సిద్ధం అయింది అని విశ్లేష వర్గాలు చెప్తున్నాయి. మ్యాటర్ లోకి వెళ్తే తాప్సీ ఔట్ సైడర్స్ ఫిలిమ్స్ సంస్థ మన హీరోయిన్ తాప్సీ దే. వారు ఎపుడు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూవచ్చారు. ఇప్పుడు కూడా తాపీసీ నిర్మాణ ఆధ్వర్యంలో సమంత తో జత కలిపి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.
దీనిపై అధికారిక ప్రకటన త్వరలో జరపబోతున్నారు. దీనికి తోడు సమంత ఇదివరకే రెండు బాలీవుడ్ వెబ్ సిరీస్ లు కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా బాలీవుడ్ లో ఒకేసారి 3 స్క్రిప్ట్స్ తో సమంత ఎంట్రీ ఇయ్యడం విశేషం.
ఇదిలా ఉండగా సమంత తెలుగులో కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు సైన్ చేస్తుంది. ప్రస్తుతానికి సమంత గుణశేఖర్ దర్శకత్వం లో చేసిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ అయిపొయింది.
ఇలా సమంత వరుస సినిమాలతో లైఫ్ మరల బిజీ చేసుకొని ఈసారి బాలీవుడ్ లో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇయబోతుంది. చూడాలి మరి సమంత బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..