Samantha focusing on another Bolly Webseries : ఇంకో బాలీవుడ్ ఓటీటీ ప్రాజెక్ట్ కి సమంత గ్రీన్ సిగ్నల్ :-

Samantha focusing on another Bolly Webseries : సమంత వరుస సినిమాలతో బిజీ, బిజీ లైఫ్ లీడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా , అక్కినేని కోడలిగా ఎన్నో బాధ్యతలు మోస్తూ లైఫ్ లో ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలా ఉండగా సమంత ఇటీవలే ఓటీటీ లో అడుగుపెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో రాజి పాత్రలో కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఎన్నో ప్రశంశలు కూడా పొందింది. రాజ్ అండ్ డికె దర్శకత్వం వచ్చిన ఈ సిరీస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయి సమంత స్థాయి ని మరింత పెంచింది అన్న విషయం అందరికి తెలిసిందే.
అయితే ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వం లో శాకుంతలం అనే సినిమాలో బిజీ గా ఉన్న సమంత త్వరలో మరల రాజ్ అండ్ డికె తో కలిసి వర్క్ చేయనుంది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
సమంత పని తీరు , పని మీద తనకున్న డెడికేషన్ రాజ్ అండ్ డికె కి నచ్చడం తో సమంత తో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ సిరీస్ కూడా ఓటీటీ లోనే విడుదల అవ్వనుంది. త్వరలో పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటించనున్నారు. చూడాలి మరి ఈసారి సమంత ని రాజ్ అండ్ డికె ఏ రేంజ్ లో చూపబోతున్నారో.