Gossips

Samantha For Nani : నాని కోసం సమంత ?:-

Samantha For Nani

Samantha For Nani : అవును మీరు చదివింది నిజమే. నాని కోసం సమంత రాబోతుంది. ఏంటి అర్ధం లేకుండా మాట్లాడుతున్నాము అనుకుంటున్నారా. గతం లో నాని సమంత కలిసి ఈగ మరియు ఎటో వెళ్ళిపోయింది మనసు వంటి సినిమాలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలకి మరియు వీరిద్దరి ఆన్ స్క్రీన్ జంట కి ఫ్యాన్స్ ఫిదా అప్పట్లోనే.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు సైన్ చేస్తూ లైఫ్ ఫుల్ బిజీ బిజీ గా ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటుంది. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమా , హిందీ లో వెబ్ సిరీస్ లు ఇలా అనేక రకమైన ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంది.

ఇంకోపక్క నాని , నాని కూడా దాదాపు 5 సినిమాలు లైన్ అప్ చేసి షూటింగ్స్ చేస్తూ బిజీ గా ఉన్నారు. నాని శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు సిద్ధం అని అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.

ఇదిలా ఉండగా నాని 29 వ సినిమా అయినా దసరా అనౌన్స్మెంట్ ఇటీవలే జరిగింది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటించబోతుంది. అయితే ఈ టిపికల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలో సమంత ముఖ్యమైన పాత్ర చేయబోతోందని విశ్లేష వర్గాలు చెప్తున్నాయి.

నాని కోసం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నపటికీ సమంత ఈ ఇంపార్టెంట్ రోల్ కి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారు. సమంత చేయబోయేది నెగటివ్ రోల్ ఆ లేదా గెస్ట్ రోల్ ఆ అనేది సినిమా విడుదల అయితే కానీ చెప్పలేం.

కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది నాని సినిమాలో సమంత ముఖ్య పాత్ర చేయడం. చూడాలి మరి ఎం జరగబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button