Same Stories but Different Screenplay’s : మొన్న ఓం శాంతి ఓం, నిన్న గీతాంజలి , నేడు అన్నాబెల్లె సేతుపతి :-

Same Stories but Different Screenplay’s : ఒకే కాన్సెప్ట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లే రాసుకొని కొని సార్లు సినిమా తీస్తారు. బహుశా కొని సార్లు సేమ్ కాన్సెప్ట్ ఉన్నాకూడా జనాలు హిట్ చెసేస్తారు. అది డైరెక్టర్ స్క్రీన్ ప్లే తో చేసే మ్యాజిక్. మొన్న ఒక ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు తేజ చెప్పారు ‘ అందరు ఒకే కథతో ఎన్నో సినిమాలు తీస్తున్నారు, అని హిట్స్ ఏ నేను మాత్రం ఏ సినిమా తీసిన జయం జయం అంటున్నారు అని ‘. అలానే ఉంది ఇపుడు. ప్రస్తుతం వస్తున్నా సినిమాలని ఒకే కాన్సెప్ట్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తీస్తూనే ఉన్నారు.
మ్యాటర్ లోకి వస్తే షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం అనే సినిమా తీసి బాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఉన్న గత జన్మ మరియు ప్రస్తుత జన్మ అందులోనూ దెయ్యం కాన్సెప్ట్ మిక్స్ చేసి తీయడం జరిగింది .
అయితే కొన్ని ఏళ్ళ క్రితం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మరియు అంజలి కలిసి నటించిన హారర్ సినిమా గీతాంజలి. ఈ సినిమాలో కామెడీ ఎక్కువ పెటేసి క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి ఓం శాంతి ఓం ఫ్రీమేక్ అనుకునేలా చేశారు.
ఇపుడు విజయ్ సేతుపతి మరియు తాప్సీ నటించిన అన్నాబెల్లె సేతుపతి అనే సినిమా ట్రైలర్ హాట్ స్టార్ లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చుసిన వారిలో చాల మంది ఇదికూడా ఓం శాంతి ఓం లాగానే అనిపిస్తుంది అని అనుకుంటున్నారు. ఆ రాజమహల్ అందులో గతం లో ఉన్న ప్రేమికులు మళ్ళీ కొని సంవత్సరాల తర్వాత మరో జన్మలో కలవడం అందులో కామెడీ ఎక్కువ పెట్టడం చూసి అందరికి అలాగే అనిపిస్తుంది.
సెప్టెంబర్ 17 న హాట్ స్టార్ లో విడుదల అవ్వబోతుంది ఈ సినిమా. ఈ సినిమాని తెలుగు, తమిళ్ మరియు ఇతర బాషలలో ఒకేసారి విడుదల చేయనున్నరు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో అని.