telugu gods devotional information in telugu
ఈరోజు అమ్మ వారి ప్రత్యేక ఆరాధన lakshmi maatha special

lakshmi maatha special
ఈరోజు యొక్క ఆరాధనా విశేషాలు తెలుసుకుందామా
ఈరోజు మార్గశిర బహుళ షష్టి ఉదయాన మరియు సాయం సమయాన సప్తమి తిధితో కుడి ఉంది.మరియు వారం శుక్రవారం.త్రి శక్తి స్వరూపం అయిన అమ్మవారిని ఉమా రమా భారతి రూపంగా కొలవాలి.ధవళ వస్త్రాలు శాంతికి, ఎరుపు వస్త్రాలు అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు.పసుపు రంగు వస్త్రాలు సకల శుభాలు కలిగిస్తాయి.
నవగ్రహ అనుకూలత కోసం ఈరోజు అమ్మవారి ఆలయంలో ఎండిన నిమ్మ డోప్ప లలో రాహుకాల సమయాన ఎవరితో అయినా కలిసి వెళ్ళి దీపారాధన చేయండి. ఈ దీపారాధన కేవలం రాహుకాలం లో మాత్రమే చేయండి. ఎలాంటి పరిస్థితిలో కూడా ఒంటరి గా దీపారాధన చేయరాదు. అమ్మవారి కి సాయంత్రం వేళ శ్రీ సూక్తం పఠన లేదా లక్ష్మి హృదయం పఠన లేదా లక్ష్మి గద్యం పారాయణం చేయండి. అమ్మవారి తో పాటు ఖచ్చితంగా నారాయణుని కూడా పూజ చేయాలి. తిధి సప్తమి కాబట్టి, శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా అనుకూల ఫలితాలు ఉంటాయి.