Sekhar Kammula will make another film with Chay soon : నాగ చైతన్య తోనే ఇంకో సినిమా చేస్తాను – శేఖర్ కమ్ముల :-

Sekhar Kammula will make another film with Chay soon : అవును మీరు చదివింది నిజమే. లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్ లో రచ్చ మాములుగా చేయడం లేదుగా. రిలీజ్ అయి 5 రోజులు అయినా కూడా కలెక్షన్స్ లో టాప్ పోజిషన్ లో ఉంది. వీక్ ఎండ్ కాకపోయినా ప్రేక్షకులకు థియేటర్ కి వెళ్లి మరి ఈ సినిమా చూస్తున్నారంటే దానికి కారణం శేఖర్ కముల మ్యాజిక్ మరియు ఆన్ స్క్రీన్ చైతు , సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. వీటన్నింటికి మించి పవన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికి మైండ్ లో ప్లే అవుతుంటాయి. ఇలా ప్రతి విషయం లో లవ్ స్టోరీ సినిమా టాప్ లో ఉంది , కలెక్షన్స్ లో కూడా.
ఇదిలా ఉండగా ఇదివరకే జరిగిన ప్రమోషనల్ మీట్ లో ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిత్ర బృందం తో సభ ముఖంగా శేఖర్ కమ్ముల గారు ముందుగా ఈ విధంగా అన్నారు ” చైతు , సాయి పల్లవి నటన నా కధకి ప్రాణం పోసింది. వీరితో ఇంకో సినిమా చేయబోతున్న త్వరలో ఈ సినిమా వివరాలు వెల్లడిస్తాను ”’అని చెప్పారు.
దీనితోపాటు లవ్ స్టోరీ నిర్మాత అయినా నారాయణ దాస్ కూడా అదే ప్రమోషనల్ మీట్ లో. ‘ ఈ సినిమా అనుకున్న దాని కంటే రెట్టింపు గా నడుస్తుంది. కలెక్షన్స్ పరంగా , ప్రేక్షకులని అలరించే విషయం లో కానీ ఎక్కడ తగ్గకుండా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే శేఖర్ కమ్ముల గారు చెప్పినట్లు త్వరలోనే మరల మేమందరం కలిసి ఇంకో సినిమా చేయబోతున్నాం. నాగ చైతన్య ని మరల ఎన్నడూ చూడని విధంగా చుపియబోతున్నాము” అని చెప్పారు.
మొత్తానికి లవ్ స్టోరీ చిత్ర బృందం మరల కలిసి ఇంకో సినిమా చేయబోతున్నారని అర్ధం అయింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు లో ప్రారంభం కావచ్చు. ఈ లోపు చైతు తాను కమిట్ అయినా సినిమాలు పూర్తి చేసేస్తారు. ఇంకోపక్క శేఖర్ కమ్ముల కూడా ధనుష్ తో చెయ్యబోయే ప్యాన్ ఇండియా సినిమా కూడా పూర్తవుతుంది.
చూడాలి మరి ఈ కాంబినేషన్ మరల కలిసి లవ్ స్టోరీ కి మించి సినిమా తీయబోతున్నారో లేదో అని.