కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే కంపెనీ బాధ్యత వహించదు !

కరోనా తో బాధపడుతున్న వారు మా కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కి దారితీస్తే , టీకా కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదని ‘ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అదర్ పూనావల్లా వెల్లడించారు. అనుకోకుండా ఆ కరోనా సోకిన వ్యక్తికి టీకా వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తీ బాధ్యత ప్రభుత్వమే తీసుకొనే విదంగా సీఎం తో చర్చలకు సిద్ధం అవుతున్నామని తెలిపారు.
ప్రభుత్వం కంపెనీలకు అండగా నిలవకపోతే టీకా కంపెనీలు ప్రయోగాలు చేయడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయం పై దేశాల్లోని వ్యాక్సిన్ తయారీదారులు చర్చించుకుంటున్నారు. వ్యాక్సిన్‌తో ఏదైనా సీరియస్ సమస్యలు వస్తే కంపెనీలపై కేసు వేసే ఛాన్స్ ఉంది. ఈ టైం లో ప్రభుత్వం పట్టించుకోకపోతే టీకా సంస్థలు భయపడతాయి.
అందువల్ల ప్రభుత్వం తయారీదారులకు అండగా నిలిచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. ఈ విషయం లో అమెరికా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పూనావల్లా తెలిపారు.