ఈరోజు భారతీయుడి బర్త్ డే!

Shanker Birth date: 17 August 1963
శంకర్ ఈ పేరు తో వచ్చే సినిమాల కోసం బాక్స్ ఆఫీస్ వెయిట్ చేస్తుందనటంలో అతిశయోక్తిలేదు , ఇండియాలోనే సుప్రసిద్ధ దర్శకుల్లో మొదటి స్థానం , 1993 లో వచ్చిన జెంటిల్ మెన్ నుండి మొదలైన ప్రస్తానం ఇప్పటి రోబొ భారతీయుడు 2 వరకు కొనసాగుతూనే ఉంది , శంకర్ సినిమాలు అంటే సినీ ప్రియులు గుక్క తిప్పకుండా సినిమా పేర్లు చెబుతారు , ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ అంతర్లీనంగా ఉంటూనే ఉంటుంది .
1996 లో వచ్చిన భారతీయుడు , తర్వాత వచ్చిన ఒకేఒక్కడు , అపరిచితుడు, శివాజీ ఇలాంటి సినిమాలు సోషల్ మెసేజ్ సినిమాల్లో ముందు వరసలో ఉంటాయి , ఇలాంటి సినిమాలు తీసి విజయం సాధించాలంటే శంకర్ తప్ప వేరే పేరు వినబడదు, శంకర్ సినిమా వస్తుందంటే పెద్ద హీరో సినిమాలు సైతం పక్కకి తప్పుకోవాల్సిందే శంకర్ సినిమాలో ఉండే కంటెంట్ అలాంటిది .
తెలుగు విజన్ విజన్ అల్సొ విషింగ్ తో లెజెండరీ డైరెక్టర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే టూ #shanker