తాను మహిళ కాదు…కొన్ని పరీక్షల ద్వారా పయటపడ్డ నిజాలు…!

ప్రపంచ దేశాల్లో ఎక్కువ జనాభా గల దేశంలో చైనా ఒకటి, ఆ చైనాలో ఒక మహిళ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన ‘పింగ్ పింగ్’ మహిళ కాదన్న విషయం పాతికేళ్ల తర్వాత బయటపడింది.
పింగ్ పింగ్ పెళ్లికి ముందు అందరు అమ్మాయి అనే అనుకున్నారు. తన శరీర ఎదుగుదల కూడా చాల నెమ్మదిగా ఉండేది. ఈ విషయాన్నీ వైద్యుడికి చెబితే లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని , దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపాడు. ఈమేకు యుక్త వయసు రాగానే పెళ్లికూడా చేసారు. తర్వాత గర్భం దాల్చడానికి ఎన్నోప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితంలేకపోయింది.
ఈ మధ్యన తనకు గాయం కావడంతో డాక్టర్ లు స్కాన్ చేయగా…. తనకి అండాశయం , గర్భాశయం కానీ లేదని , అలాగే ఎముకలు వయసుకు తగ్గట్టు ఎదగలేదని , సరిగా అభివృద్ధి చెందని రీతిలో స్త్రీ, పురుష జననావయాలు ఉండటం. జన్యుపరంగా మాత్రం పురుషుడేనని వైద్య నిపుణులు చెప్పడం తో ఆశ్చర్యపోవడం ఆమె భర్త, తల్లిదండ్రుల వంతు అయింది .
ఇలా భార్యాభర్తలు మేనరిక సంబంధాలు చేసుకోవడం తో కొందరిలో ఇలా జరుగుతుందని కూడా పెద్దవారు భవిస్తూ ఉంటారు.