telugu gods devotional information in telugu

ఈ శనివారం వేంకటేశ్వర స్వామి ఆరాధన

ఈరోజు మార్గశిర శనివారం . . ఈ శనివారం నకు ఒక ప్రత్యేకమైన కారణం కలదు.

రేపటి నుండి మొదలయ్యే ధనుర్మాసం కి ముందు వచ్చే శనివారం అత్యంత ప్రాధాన్యత కలది. ఈరోజు విష్ణు మూర్తి ఆరాధన అత్యంత శుభకరముగనిచ్చు. ఈరోజు విష్ణు ఆలయము లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం మీకు శుభాలను కలిగిస్తుంది.

శనివారం నాడు చేసే వెంకటేశ్వర ఆరాధన మిగిలిన ఆరువారాల యొక్క ఆరాధన ఫలితం ఈ ఒక్క రోజు చేసే ఆరాధన వల్ల వస్తుంది. ఈరోజు వెంకటేశ్వర ఆలయం లో పిండి దీప ఆరాధన చేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరణ చేయాలి. విష్ణు సహస్ర నామ పారాయణ కూడా ఎన్నో రెట్ల ఫలితం ఇస్తుంది.

వెంకటేశ్వర ఆరాధన కలియుగం లో ఏంతో పుణ్యదాయకం.పురాణాలను అనుసరించి తిరుమల ను మించిన క్షేత్రం కలియుగము లో మరొకటి లేదు, గోవింద నామం గోవిందుని మించిన దైవం మరొకటి లేదు. అందుకే తిరుమలలో అంత రద్దీ అంత నమ్మకం స్వామి వారంటే . . ఆయన కూడా భక్తుల నమ్మకము ఎప్పుడూ వమ్ము చేయలేదు.
గోవిందా గోవిందా

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button