భయంతో షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన శృతి హాసన్…కారణాలేంటి !

ఈ మధ్యనే ఓ సినిమా షూటింగ్‌కు హాజరైన శ్రుతి మధ్యలోనే కాస్త భయానికి గురై ఇంటికి వెళ్లిపోయిందట. ఇందులో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాభం` అనే తమిళ సినిమాలో శ్రుతి హీరోయిన్గా చేస్తుంది.
ఈ సినిమా కి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ మిగిలి ఉండగా శ్రుతి హాజరైంది. ఆ సినిమా షూటింగ్ ని వీక్షించడానికి అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు గుంపులుగా వచ్చారట. దీంతో కరోనా భయంతో శ్రుతి షూటింగ్ స్పాట్ నుంచి సడెన్ గా వెళ్లిపోయిందట. చిత్ర యూనిట్ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చిత్రీకరణ ఎలా చేస్తున్నారంటూ యూనిట్‌పై ఆగ్రహం వెళ్ళగక్కిందట .
`కోవిడ్-19 వల్ల ప్రతిఒక్కరి ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కరోనా జాగ్రత్తలు పాటించని పక్షంలో.. ఓ మహిళగా, నా భద్రత కోసం జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉందని, అందుకనే షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్లాల్సి వచ్చిందని శ్రుతి ట్వీట్ చేసింది.