Shruti Haasan: మేడం మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా…దిమ్మతిరిగే సమాధానం చెప్పిన శృతిహాసన్ !

Shruti Haasan: శృతిహాసన్ ఒక మల్టీటాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తాను సినీ ఇండస్ట్రీకి సంబందించిన అన్ని రంగాలు అయినటువంటి, డాన్స్, సంగీతం, నిర్మాతగా అన్ని రోల్స్ చేసారు.
ఇపుడు తాజాగా క్రాక్ సినిమా విజయంతో శృతి ఆనందంలో ముడినిగితేలుతున్నారు. అదేవిదంగా తనకి సినిమాలో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఇదిలాఉంటే శృతి ఈ మధ్యన తన అభిమానులతో షోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. అందులో అభిమానులు అడిగిన కొన్ని ఆశక్తికరమైన ప్రశ్నలకు , సమాదానాలు చెప్పుకొచ్చింది.
మేడం ఈ ఏడాది మీరు పెళ్లిచేసుకోబోతున్నారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా , ముమ్మాటికీ ఇపుడే జరగదు అని తేల్చేసింది. అదేవిదంగా మరో అభిమాని మీ ముక్కుకు సర్జరీ చేయించుకున్నారు అన్న ప్రశ్నకు స్రుతి మాట్లాడుతూ అప్పుడో జరిగిన దానిగురించి ఇపుడు ఎందుకు అని సమాధానం చెప్పింది. ఇలా శృతిహాసన్ తన అభిమానులతో తనకు సంబదించిన విషయాలను పంచుకున్నారు.