singar sunita : టాలీవుడ్ సింగర్ సునీత ఎంగేజ్మెంట్…వైరల్ ఫొటోస్

singar sunita : టాలీవుడ్ లో అద్భుతంగా పాటలు పడే సింగర్స్ లో ఒక సునీత . తెలుగు ఇండస్ట్రీలో కేవలం సింగర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా రానిస్తు , డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది . ఇదివరకే సునీత కు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్ని కారణాలవల్ల అతనితో విడాకులు తీసుకొని తన పిల్లలతో ఉంటుంది. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
కొన్ని రోజుల ముందు నుండి సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయాన్నీ కొందరు నమ్మితే, మరికొందరు లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా సింగర్ సునీత సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని బయటపెట్టారు .
డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్థం సోమవారం జాగరడంతో తన అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. సునీత నిశ్చితార్థం ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మా పెళ్లి త్వరలో జరగనుందని, మమల్ని మీ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని అభిమానులను కోరింది.