Skylab Movie Review and Rating :-

Movie :- Skylab (2021) Review
నటీనటులు :- సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ మొదలగు
నిర్మాత :- ప్రిత్వి పిన్నమరజు
మ్యూజిక్ డైరెక్టర్ :– ప్రశాంత్ అర్. విహారి
డైరెక్టర్ :- విశావక్ ఖందేరావు
Story ( Spoiler Free ):-
ఈ కథ 1979 లో బండ లింగంపల్లి అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆకాశము నుంచి 90,000 కిలోల స్కైల్యాబ్ ఈ బండ లింగంపల్లి గ్రామంలో పడబోతోంది అనే వార్తలు వస్తాయి. కట్ చేస్తే గౌరి ( నిత్యా మీనన్ ) రైటర్ గా పరిచయం అవుతుంది. తనని ఉద్యోగం నుంచి తీసేయడం తో తిరిగి ఊరికి వచ్చేస్తుంది.
ఇంకో పక్క కొని అనుకోని కారణాల చేత సస్పెండ్ అయినా డాక్టర్ ఆనంద్ ( సత్యదేవ్ ) కూడా తిరిగి ఊరికి వచేస్తుంటాడు. చివరికి చేసిన అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులో ఉన్న రామ రావు ( రాహుల్ రామకృష్ణ ) గురించి చూపిస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి వారి ఊరిలో జరగబోయే స్కైల్యాబ్ ని ఎం చేయగలిగారు అనే అంశం తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.
ఇప్పుడు రైటర్ గా గౌరి ఈ స్కైల్యాబ్ ద్వారా ఎలా ప్రూవ్ చేసుకుంది ? ఆనంద్ , గౌరి , రామ రావు కలిసి ఎం చేశారు ? గ్రామా ప్రజలకు చివరికి ఎం జరిగింది ? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే .
Positives 👍:-
- నిత్య మీనన్ చాలా బాగా నటించింది. సత్యదేవ్ మరియు రాహుల్ కూడా బాగా చేసి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.
- కథ కొత్తగా ఉంది. రెండవ భాగం లోని సన్నివేశాలు బాగున్నాయి.
- సినిమాటోగ్రఫీ బాగుంది మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives 👎 :-
- మొదటి భాగం అంతా కామెడీ పండించాలని ప్రయత్నించిన పెద్దగా అలరించలేకపోయింది.
- సినిమా స్లో గా సాగడం.
- దర్శకుడు ఇంకా బాగా రాసుకొని ఉండాల్సింది.
Overall :-
మొత్తానికి స్కైల్యాబ్ అనే సినిమా కథ పరంగా కొత్తగా ఉన్నపటికీ దాని చిత్రీకరించే విధానం లో దర్శకుడు చాలా మటుకు విఫలం అయ్యాడనే చెప్పాలి. మొదటి భాగం అంతా స్లో గా మరియు కామెడీ కూడా పండించక ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. నిత్య మీనన్ , సత్యదేవ్ , రాహుల్ రామకృష్ణ చాలా బాగా నటించారు.
రెండవ భాగం లో ఎమోషన్స్ సీన్స్ బాగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ , విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. నిర్మాణ విలువలు చాల బాగున్నాయి. మొత్తానికి ఓపికతో స్కైల్యాబ్ సినిమా ఓసారి చూడచ్చు.
Rating :- 2.5/5