చరణ్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్ లు
రాం చరణ్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.
వినయ విధేయ రామ సినిమా ఈరోజే సంక్రాంతి కానుకగా విడుదల అయింది అయితే మొదటి షో అయిపోగానే కొంతమంది ఇందులో రియాలిటీ కి దూరంగా ఉన్న కొన్ని సన్నివేశాలకు నవ్వుకునేలా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కోలా సోషల్ మీడియాలో చరణ్ ను ఒక ఆట ఆడేస్తున్నారు. ఈ నెగెటివ్ కామెంట్ లు కూడా సినిమా యొక్క విజయాన్ని పక్క దోవ పట్టించే అవకాశాలు ఉన్నాయ్. బోయపాటి మార్క్ ఇలా అయింది ఏంటి అని కొంతమంది అభిమానులు అసహనంతో వూగిపోతున్నారు.
ఆ కామెంట్ లు ఎలా ఉన్నాయ్ అంటే ? ?
1.సినిమా ఫైట్స్ లో తలలు నరికితే గాల్లోకి ఎగరడం ఎంటొ
అవి గద్దలు ఎత్తుకు పోవడం ఏంటో ? ? ఈ సినిమా ఏంటో అనే కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
2.ఈ సినిమా లో సైన్స్ కి అందని థియరీ లు ఉన్నాయ్ అని ఒకరు.
3.సినిమాలో రన్నింగ్ ట్రైన్ మీద దూకి వైజాగ్ నుండి బీహార్ కు వెళ్ళడం వంటివి నిజానికి సాధ్యం కాదుగదా.
4.సినిమా అన్నాక ఒకటో రెండో పైట్ లు ఉండాలి అంతే కానీ సినిమా అంతా అవే ఉన్నాయ్ అంటు ఒక ఆట ఆడుతున్నారు జనాలు చెర్రీతో
ఏదేమైనా ఇవన్నీ సినిమా మీద దెబ్బ కొడతాయి.