Today Telugu News Updates
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 11 వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళి !

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన తొలి అమరుడు శ్రీకాంత చారి ఈయన 11 వ వర్ధనతి సందర్బంగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆయన మా ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోయాడు. అతి చిన్న వయస్సులో ప్రత్యేక తెలంగాణ కోసం అమరుడు కావడం మమ్మల్ని కలచివేసింది అన్నారు. శ్రీకాంత చారి వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ శ్రీకాంత చారి త్యాగాన్ని గుర్తించి ఆయన తమ్ముడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించామని తెలియజేసాడు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.