Son Of India Movie Review :-

Movie :- Son Of India (2022) Review
నటీనటులు :- మోహన్ బాబు , శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి, అలి మొదలగు
నిర్మాత :- మంచు విష్ణు
సంగీత దర్శకుడు :- ఇళయరాజా
దర్శకుడు :- డైమండ్ రత్నబాబు
Story (Spoiler Free):-
ఈ కథ కడియం బాబ్జీ అలియాస్ విరూపాక్ష (మోహన్ బాబు ) వరుస బెట్టి కిడ్నాపింగ్స్ చేయడం తో మొదలవుతుంది. ప్లాన్ చేసి మరి పొలిటీషియన్ ను , డాక్టర్ ను , ఏడ్యుకేషనలిస్ట్ ను కిడ్నాప్ చేస్తారు. ఇంకోపక్క విరూపాక్ష ని పట్టుకోవడమే పని గా పెతుకుంది ప్రగ్య జైస్వాల్ ( NIA ఆఫీసర్).
అస్సలు విరూపాక్ష ఎందుకు సంబంధం లేని వృత్తిలో ఉన్నవారిని కిడ్నాప్ చేస్తున్నాడు ? అతనికి ఏమైనా ఫ్లాష్ బ్యాక్ లో చేదు అనుభవం ఎదురైందా ? ఇంతకీ ఏం జరిగింది ? ప్రగ్య జైస్వాల్ కి విరూపాక్ష దొరికాడా లేదా ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Positives 👍:-
- మోహన్ బాబు బెస్ట్ పెర్ఫార్మెన్స్.
- కథ.
- నిర్మాణ విలువలు బాగున్నాయి మరియు సినిమా నిడివి.
Negatives 👎:-
- కధనం సరిగ్గా రాసుకోలేదు.
- దర్శకత్వం
- లాజిక్ లేస్ సీన్స్.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
Overall :-
మొత్తానికి సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా మోహన్ బాబు గత చిత్రాలతో పోల్చుకుంటే బెటర్ అనే చెప్పాలి. మోహన్ బాబు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దర్శకుడు కథ బాగా రాసుకున్నప్పటికి కధనం సరిగా రాసుకోకపోవడం తో విఫలం అయింది. కధనం కొత్తగా రాసుకునింటే యావరేజ్ టాక్ అయినా వచ్చేది.
ఎడిటింగ్ అస్సలు బాలేదు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కాకపోతే పెరఫార్మన్సెస్ తో ప్రేక్షకులని సినిమాతో కట్టిపడేయలేము. మొత్తానికి ఈ సినిమా ఈ వారం ఓసారి చూడచ్చు ఎక్స్పిక్టేషన్స్ లేకుండా.
Rating:- 2/5