వామ్మో … సోనాక్షి సిన్హా కి లైసెన్స్ వచ్చిందట …

సూపర్‌స్టార్ శత్రఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా తనకు లైసెన్స్ వచ్చిందని తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
అసలు విషయానికి వస్తే .. సోనాక్షి సిన్హాకు స్కూబా డైవింగ్ అంటే ప్రాణం . ఇప్పుడు ఆ స్కూబా డైవింగ్‌లో సోనాక్షి లైసెన్స్‌ను సాధించింది. స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ పొందేందుకు తాను రాసిన పరీక్ష తాలూకు సమాధాన పత్రాన్ని, ట్రైనర్ వద్ద నుంచి లైసెన్స్ పత్రాలు తీసుకుంటున్న ఫోటోలను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ పెట్టింది .
కొన్నేళ్లుగా స్కూబా డైవింగ్ లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాను. మొత్తానికి దాన్ని సాధించాను. తొలిసారి స్కూబా డైవింగ్ చేసినప్పటి నుంచి సముద్రంపై ఇష్టం పెరిగింది. ఇప్పుడు అది కాస్తా వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. స్కూబా డైవింగ్‌లో శిక్షణ ఇచ్చిన మహమ్మద్ గారికి చాల థాంక్స్ . నేను ఏ పరీక్షలోనూ ఇలా వందకు వంద శాతం మార్కులు సాధించలేదు అంటూ సోనాక్షి చెప్పుకొచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న సోనాక్షి అభిమానులు కంగ్రాట్స్ షోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.