Tollywood news in telugu
టాప్-4 లో నిలిచిన సోనూసూద్ !

రియల్ హీరో సోనూసూద్ మరో రికార్డు ను తన సొంతం చేసుకున్నాడు. కష్టకాలంలో పేదలను, పొరుగు రాష్ట్ర ప్రజలను ఆదుకున్న వారి జాబితాలో సోనూసూద్ టాప్ లో నిలిచాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లలా సోనూ ముందు వరుసలో నిలిచాడు.
సోషల్ మిడియా అనలిటికల్ సంస్థ ప్రకటించిన నివేదికలో అన్ని విభాగాల్లో కలిపి సోనూ నాలుగో స్థానంలో నిలిచాడు . రాజకీయాలు, జర్నలిజం, వ్యాపారం, క్రీడలు, సినిమాలు, సాహిత్యం ఇలా పలు రంగాల్లో కలిపి టాప్ సెలిబ్రిటీస్ ఎవరని చూడగా .. సోనూ అందులోనూ చోటు దక్కించుకున్నాడు.
మొదటి స్థానంలో మోదీ, రెండో స్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా, 2.4మిలియన్ల తో నాలుగో స్థానంలో సోనూసూద్ ఉన్నాడు. సోను కు instagram 7.8 మిలియన్లు, ట్విటర్లో 4.7మిలియన్లు, facebook 3.7మిలియన్ల అభిమానులు సోను ని ఫాలో అవుతున్నారు .