sreekaram movie trailer : ‘ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం..అంటూ శ్రీకారం ట్రైలర్ విడుదల..!

sreekaram Trailer : హీరోహీరోయిన్లు గా శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నమూవీ ‘శ్రీకారం’. ఈ సినిమాకు కిషోర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతుంది. అదేవిదంగా రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రోజున సాయంకాలం ‘శ్రీకారం’ టీజర్ ని సినీ యూనిట్ సభ్యులు విడుదల చేసారు.
ఉన్నత చదువులు చదివిన ఒక రైతు కొడుకు ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్ వదిలిపెట్టి మరీ రైతుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే పాయింట్ ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. శర్వా ఒక పల్లెటూరి యువకుడిగా లేటెస్ట్ పద్ధతిలో ఫార్మింగ్ చేసే క్యారెక్టర్‌లో, అద్భుతమైన డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకుంటున్నాడు.
ఈ సినిమాలో రావు రమేష్, సాయి కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో ‘పొలానికీ, పని ముట్టుకీ ఖాళీ లేకుండా సంవత్సరం మొత్తం ఏదో పంట చేతికొస్తూనే ఉండేలా చూద్దాం….అంటూ .. . ఉమ్మడిగా చేసిన యుద్ధాల్లో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవొచ్చు’ అంటూ సాగే డైలాగ్ ఈ సినిమాకి హైప్ ని తీసుకొస్తున్నాయి. శర్వానంద్ మూవీ బారి అంచనాలతో మహా శివరాత్రి రోజున ఆ శివుని ఆశీర్వాదంతో మార్చి 11న ‘శ్రీకారం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.