telugu bigg boss
బిగ్ బాస్ లో హీరో శ్రీకాంత్ ని ఇంప్రెస్ చేసింది ఎవరంటే ?

బిగ్‌బాస్ సీజన్ 4 లో విజేత గా ఎవరు నిలుస్తారన్న దానిపై హీరో శ్రీకాంత్ తన అభిప్రాయం తెలియజేసాడు. అందరితో కంపేర్ చేస్తే అభిజిత్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడని హీరో శ్రీకాంత్ అన్నాడు. అభిజిత్ విన్నరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. అభిజిత్ తో పాటు అరియానా, అఖిల్. సోహైల్, హారిక టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పేశాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారమైతే అభిజిత్ విన్నర్ అవుతాడని అనిపిస్తోందని ఆయన తన అబిప్రాయాన్ని వెల్లడించాడు. ఇదిలా ఉంటె ఇప్పటికే నాగబాబు అభిజిత్‌కు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిదంగా వీరితో పాటు కొందరు జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా అభికే సపోర్ట్ చేస్తున్నారు.