SRK son Aryan Khan Illegal Drug case issue solved : షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేస్ ముగిసింది :-

SRK son Aryan Khan Illegal Drug case issue solved : నిన్న అనగా ఆదివారం షారుఖ్ ఖాన్ కొడుకు అయినా ఆర్యన్ ఖాన్ ని ఇల్లీగల్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు.
మ్యాటర్ లోకి వెళ్తే నిన్న ఆదివారం అక్టోబర్ 3 న ఆర్యన్ ఖాన్ ముంబై కోస్ట్ లోని క్రూయిస్ షిప్ లో రేవ్ పార్టీ చేసుకుంటుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బృందం వారికీ అదే షిప్ లో అడ్డంగా ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపడ్డారని, వెంటనే ఆర్యాన్ ఖాన్ ని మరియు ఇతర 7 మందిని అరెస్ట్ చేసి రోజంతా విచారణ జరిపారని తెలిసింది.
అయితే విచారణ లో ఆర్యన్ ఖాన్ ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారణ అయింది. కాకపోతే అది పార్టీ లో దొరికిన డ్రగ్స్ ఏ కానీ ఇతర ఇల్లీగల్ డ్రగ్స్ అమ్మేవాళ్ళతో ఆర్యన్ కి ఎటువంటి సంబంధాలు లేవు అని తేలింది.
నార్కోటిక్స్ బ్యూరో , ఆర్యన్ ఖాన్ ఫోన్ అంత చెక్ చేసారు , మెడికల్ చెక్ అప్స్ కూడా చేయించి చివరికి ఈ విధంగా చెప్పారు ” ఆర్యన్ మీద ఎలాంటి పోలీస్ కస్టడీ జరగబోదు , ఈ కేసు ఇంకా ముందుకు కొనసాగించదలుచుకోలేదు , ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ దొరికితే తీసుకున్నారు తప్ప , అతనికి డ్రగ్ డీలర్స్ కి ఎటువంటి సంబంధాలు లేవు అని పూర్తి విచారణలో తేలింది.
అయితే ఆర్యాన్ ఖాన్ ఇల్లీగల్ గా డ్రగ్స్ తీసుకునేందుకు జరిమానా కట్టాల్సిందే అని వెల్లడించారు. మొత్తానికి షారుక్ ఖాన్ అబ్బాయి అయినా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఒక్కరోజులోనే పూర్తవ్వడం విశేషం.