movie reviews

State of siege temple attack

State of siege temple attack

సినిమా :- State of siege temple attack (2021)

నటీనటులు :- అక్షయ్ ఖన్నా , వివేక్ దహియా , గౌతమ్ రోడ్.

నిర్మాత:- అభిమన్యు సింగ్

డైరెక్టర్ :- కెన్ ఘోష్

లాక్డౌన్ సమయం లో ప్రజలకి ఓ టీ టీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు State of siege temple attack అనే సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.

కథ :-

ఈ కథ 2002 లో గుజరాత్ లోని అక్షర్ ధామ్ దేవాలయం లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ మీద చిత్రీకరించారు. టెర్రరిస్ట్స్ లు దేవాలయం లోని మనుషులని బందీలుగా మార్చేసి తమ ఆలోచనలను కార్యరూపం లో అమలుచేసే పనిలో ఉండగా NSG కమాండోస్ ని పంపించి ప్రజలని కాపాడే బాధ్యతను మేజర్ హ్యనట్ సింగ్ యొక్క బృందానికి అప్పగించింది. మిగిలిన కథ హ్యనట్ సింగ్ మరియు అతని బృందం తమ ప్రాణాలకు తెగించి ప్రజలను ఎలా కాపాడారు ? టెర్రరిస్టులను తమదైన శైలీ తో ఎలా పట్టుకున్నారు అనేది తెరపైన చూడాల్సిందే.

👍🏻:-

  • అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు మరియు టెర్రరిస్టులుగా నటించినవారంతా సినిమాకి ప్రాణం పోశారు.

*కథ బాగా రాసుకున్నారు మొదటి భాగం లో వచ్చే థ్రిల్స్ కానీ ఎమోషన్స్ కానీ బాగా పండింది.

  • సినిమాటోగ్రఫీ కొత్తగా అనిపిస్తుంది.
  • డైరెక్టర్ కెన్ ఘోష్ ప్రేక్షకులని అలరించేలా తీయాలన తపన మరియు తాను పడిన కష్టం కనబడుతుంది.

*నిర్మాణ విలువలు గ్రాండియర్ గా ఉంది.

  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది.

👎🏻:-

  • దర్శకుడు మొదటి భాగం లో పెట్టినా శ్రమ రెండవ భాగం లో పెట్టలేదేమో అనిపిస్తుంది.
  • రెండవభాగం అంత ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది.
  • క్లైమాక్స్ కూడా సిల్లీగా తీసేసారు.

ముగింపు :-

మొత్తానికి State of siege temple attack అనే సినిమా ప్రేక్షకులను సో సో గా అలరిస్తది. అక్షయ్ ఖన్నా ఈ చిత్రం ద్వారా మల్లి యాక్షన్ లోకి అడుగుపెట్టి తనదైన శైలీతో ప్రేక్షకులని అలరించారు. డైరెక్టర్ కథ చక్కగా రాసుకున్నారు బాగా థ్రిల్ చేసే అంశాలు కానీ ఎమోషనల్ సన్నివేశాలు కానీ సరిగా రాసుకున్నారు కాకపోతే రెండవ భాగంలో ఎం చేయాలో తెలియక గబా గబా లాగించేసారు అన్నట్లు అనిపిస్తది. కెమెరా పని తీరు నిర్మాణ విలువలు అని అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఈ వారంలో ఈ సినిమాని ఓసారి సరదాగా కుటుంబం తో చూసేయచ్చు.

రేటింగ్ :- 2.75/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button