Story behind yuvaraj six sixes
Story behind yuvaraj six sixes
Story behind yuvaraj six sixes:: (యువరాజ్ ఆరు సిక్సులు కథ):: యువరాజ్ అంటే ఎక్కువ గుర్తుకు వచ్చేది ఆరు సిక్సులు , అది ఆషామాహి టీం పైనా కాదు బౌలింగ్ తో భయపెట్టే ఇంగ్లాడ్ తో, ఆ రోజు యూవరాజ్ ఆరు సిక్సులు ఎందుకు కొట్టాడో ఇటీవల ఒక మీడియా తో తెలిపాడు.
తనకి ఆరు సిక్సులు కొట్టాలి అనే ఉదేశ్యం లేకున్నా అక్కడున్న అల్ రౌండర్ ఫ్లింటాఫ్ తనని మాటలతో రెచ్చగొట్టాడట , ఆలా ఫ్లింటాఫ్ కి కోపం వచ్చేలా చేసింది యువరాజే అంట , ఇంతకీ ఆలా ఎందుకు చేసాడా అనేదే గా మీ డౌట్!, అంతకు ముందు ఒక ఓవర్ లో ఫ్లింటాఫ్ బౌలింగ్ లో రెండు బౌండరీస్ కొట్టాడంట దానికి కోపం తెచ్చుకున్న అల్ రౌండర్ ఫ్లింటాఫ్ ధుషణకి దిగాడంట , మ్యాచ్ అయిపోయాక నీ మెడ విరగగొడుతా అన్నాడట , ఇక యువరాజ్ కూడా దానికి బదులుగా నా బ్యాట్ చేతులో ఉంది దీనితో ఎక్కడ కొడుతానో నీకు బాగా తెలుసు అన్నాడంట.
ఇక సీన్ కట్ చేస్తే వేరే బౌలర్ యువరాజ్ కి బౌల్ చేయటానికి వచ్చాడు , వచ్చిన ప్రతి బాల్ కోపం లో కొట్టాడు అలా ఆరు బాళ్లకి ఆరు సిక్సులు బాదాడు , ఇది చూసిన ఫ్లింటాఫ్ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలీకుండా అయిపోయింది, ఇలా ఆరు బాల్స్ కథ వివరించాడు యూవరాజ్ , టి 20 లో ఆరు బాళ్లకి ఆరు సిక్సులు కొట్టిన మొదటి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు, కానీ విచిత్రం ఏంటంటే ఫ్లింటాఫ్ బౌలింగ్ లోనే ఇన్నింగ్స్ లో చివరి బాల్ అవుట్ అయ్యాడు, మొత్తానికి ఆలా ఫ్లింటాఫ్ కి థాంక్స్ చెప్పుకున్నాడు ఇన్నాళ్ళకి