వడదెబ్బ తగిలిందని గుర్తించడం ఎలా.. వడదెబ్బ తగిలితే చేయాల్సిందేమిటి..?
వేసవికాలంలో చెప్పలేనంతగా ఎండలు కాస్తున్నాయి. చిరాకు పరిచే చెమటే, కాకుండా ఎన్నో సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. వాటిలో ముఖ్యమైంది వడదెబ్బ. దీనిని నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిస్తే..
మద్యపానం, పొగత్రాగే వారు, స్థూలకాయం, నిద్రలేమి వంటి రుగ్మతలున్నవారు సన్ స్ట్రోక్‌కి త్వరగా లోనవుతారు. వీరు తమ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

వడదెబ్బ లక్షణాలు:
వడదెబ్బకు గురైన వారిలో ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, జ్వరం, తలనొప్పి, తల తిరిగినట్లుగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం లోపించి డీహైడ్రేట్ అవుతుంది.
చెమటలు రాకుండా అధిక టెంపరేచర్‌తో పల్స్ పడిపోతుంది. మతి కోల్పోవడం కోమాలోకి వెళ్తుంతటారు.
వడదెబ్బ తగిలినపుడు శ్వాసవేగంగా ఉంటుంది. హర్ట్ రేట్ వేగంగా పెరుగుతుంది. తీవ్రంగా చెమట పట్టడం అలసటగా అనిపిస్తుంది.
మూత్రం పచ్చగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు:
ఎండలో బయటకి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్‌లు, కూలింగ్ గ్లాస్ ధరించాలి.
ఓఆర్‌ఎస్ నీళ్లు, కొబ్బరి, గ్లూకోజ్ నీరు తీసుకోవడం మంచిది.
వేసవిలో చింతపండును వేడినీటిలో షుగర్‌తో కలిపి తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.