sunday surya aradhana
ఆదివారం సూర్య ఆరాధన కు ప్రత్యేకం
ఆదివారం సూర్యుని ఆధిపత్యం గల రోజు, గ్రహరాజు అయినటువంటి సూర్యుని ఆరాధన సూర్య గ్రహ అనుకూలత తో పాటు నవగ్రహ అనుకూలత కలుగుతుంది. సూర్య ఆరాధన అంటే కష్టమైంది అనుకుంటారు చాలా మంది కాని ఆయన ఆరాధన కు సులభ మార్గాలు ఉన్నాయ్
భానుడు నమస్కార ప్రియుడు అటువంటి సూర్యునకు ఉదయం మరియు సాయంత్రం మంత్ర భాగముతో సంధ్యా వందనం చేయడం.మంత్ర భాగం చదవలేని వారు ఉదయం శుభ్రం గా స్నానం ఆచరించి సూర్యునికి అభిముఖంగా నిల్చుని ద్వాదశ నామాలతో నమస్కారం చేయడం అన్నది అతి సులభం. అంతే కాకుండా ఆర్ఘ్యము కూడా సూర్య అనుగ్రహము కలిగిస్తుంది. సూర్యుడు ఉండే దిశలు తూర్పు పడమరకు ఎదురుగా పళ్ళు తోముకోవడం , ముఖ ప్రక్షాళన అన్నది సరి కాదు , ఇది దరిద్ర హేతువు.
ఇంకా మరెన్నో ఉన్నాయ్ అవి మరిన్ని మన రాబోయే కథనాల్లో తెలుసుకుందాం.
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే