Today Telugu News Updates
Suresh Raina:స్టార్ క్రికెటర్ అరెస్ట్… టెన్షన్లో అభిమానులు

స్టార్ క్రికెటర్ సురేష్ రైనాను పోలీసులు అరెస్టు చేశారు అసలు విషయం ఏమిటంటే ముంబై ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న డ్రాగన్‌ఫ్లై క్లబ్ పార్టీలో సోమవారం రైనా పాల్గొన్నాడు. కరోనా నిబంధనలను పాటించకుండా డ్రాగన్‌ఫ్లై క్లబ్ నడపడంతో అర్ధరాత్రి 2.30 గంటలకి పోలీసులు రైడ్ చేశారు. ఈ మేరకు క్లబ్ లో ఉన్న సురేష్ రైనా ను,సింగర్ గురు రంధవ, హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సహా 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బెయిల్ పై విడుదల చేశారు.. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా దృష్ట్యా మున్సిపాలిటీలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.

ఇటీవలే ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే..
