Surya Jai Bhim Release Date Locked : సూర్య జై భీం ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్ :-

Surya Jai Bhim Release Date Locked : తమిళ స్టార్ హీరో సూర్య, ఆకాశమే నీ హద్దురా సినిమా నుంచి అయన చేసే సినిమాలు అన్ని ఓటీటీ లో విడుదల చేయబోతున్నారని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఆకాశమే నీ హద్దురా సినిమా ఓటీటీ లో విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేసి ఎన్నో అవార్డులు దక్కించుకుంది.
అయితే సూర్య తాను నిర్మిస్తున్న 4 సినిమాలు వరుసగా ఓటీటీ లోనే విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెల దాక ఒకొక్క నెలలో, ఒకొక్క సినిమా డైరెక్ట్ ఓటీటీ లో విడుదల కానుంది.
ఇదిలా ఉండగా సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలలో జై భీం ఒకటి. ఈ సినిమా అందరు థియేటర్లో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ సూర్య అందరికి షాక్ ఇచేలా ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ లో నవంబర్ 2 న విడుదల కాబోతుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ వార్త విన్న సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సూర్య సినిమా థియేటర్లో చూడాలన్న అతని అభిమానుల కల ఇప్పట్లో నెరవేరేలా లేదని అనిపిస్తుంది. సూర్య పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన జై భీం పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించింది. పోస్టర్ చూడగానే అందరికి నచ్చేసిన ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ థియేటర్ రిలీజ్ ఏ అన్ని అందరు అనుకున్నారు కానీ సీన్ రేవేసే అయింది.
ఈ సినిమాలో సూర్య పవర్ఫుల్ లాయర్ లా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన రాజిష విజయన్ కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి జ్ఞానవేల్ గారు దర్శకత్వం వహించారు.
చూడాలి మరి నవంబర్ 2 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అందరిని ఏ రేంజ్ లో అలరించబోతుందో.