Today Telugu News Updates
హైదరాబాద్ లో వరద బాధితుల సహాయం నిలిపివేత !

తెలంగాణ ప్రభుత్వం భారీ వరదల కారణంగా నష్టపోయిన బాధితుల్ని ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు ప్రకటించింది. అయితే ఈ వరద సహాయాన్ని ప్రస్తుతం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది .
ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, డబ్బుల పంపిణీని నిలిపివేయాలని ఎస్ ఈసీ ఈ మేరకు సూచించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత పథకాన్ని కొనసాగించుకోవచ్చని ఎన్నికల సంఘం ఉత్వర్వుల్లో పేర్కొంది. వరద సాయంపై పలు రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో, వరద సాయం చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయా పార్టీ నేతలు తెలపడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియాకు,ప్రజలకు తెలిపింది.