తమన్నా గురించి ఆసక్తి కరమైన వాక్యాలు చేసిన పూజా హెగ్డే పైగా వీరిద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్నారట …!

బాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే , టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి కొన్ని ఆశక్తికర వాక్యాలు చేసింది. తమన్నా, పూజా హెగ్డే ఇద్దరూ ఒకే బడిలో చదువుకున్నారట.. ఈ విషయాన్నీ పూజ నే స్వయంగా వెల్లడించింది.
ఒక ఇంగ్లీష్ మీడియాకు పూజ ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ ఆశక్తికర వాక్యాలు చేసింది. అలాగే తమన్నా స్కూల్ డేస్ లో ఎలాఉండేదో కూడా చెప్పుకొచ్చింది.
పూజా మాట్లాడుతూ.. తన కంటే తమన్నా సీనియర్ అని, మేము ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని… తమన్నా ఎంతో అందంగా ఉంటుందని అంటూ… తమన్నా స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా ఎంతో ఆశక్తిగా పాల్గొనేది అని అదేవిదంగా ఎంతో చక్కగా ఆమె డాన్స్ చేసేదని తెలిపింది. స్కూల్ లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో ఫ్రెండ్షిప్ చేసేది.
ఆమె అందరితో చలాకీగా ఉండే గుణం చాలా నచ్చేదని , ఇక తమన్నా స్కూల్ ఫంక్షన్ లలో చక్కటి సంప్రదాయ దుస్తుల్లో ఎంతో బాగా కనిపించేది ఆ టైంలోనే మోడెర్న్ దుస్తుల్లో కూడా మెరిసిపోయేదని తెలిపింది.