ఆ నటిపై దేశద్రోహం కేసు నమోదుచేయాలని డిమాండ్…. దేనికో తెలుసా..!

Tamil Actress Ovia Helen : తమిళ నటి ఒవియా హెలెన్ షోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ కు ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఆ నటిపై ఏకంగా దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న ఫిబ్రవరి 14న ప్రధానమంత్రి మోదీ తమిళనాడులో పర్యటించి పలు అభివృద్ధి పనులు చేప్పట్టి వాటికీ శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంలో కొంతమంది సోషల్ మీడియాలో ‘మోడీ గో బ్యాక్’ అంటూ ట్రెండ్‌కు చేసారు. ఈ క్రమంలో ఒవియా కూడా ‘మోడీ గో బ్యాక్’ అంటూ ట్వీట్ చేసింది.

ఈ విదంగా ఒవియా ట్వీట్ చేయడంతో చెన్నై బీజేపీ నాయకులు ఆమెపై మండిపడుతున్నారు. తన ట్వీట్ విషయంలో లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని నిరసనలు చేస్తున్నారు.
బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1తో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తమిళ్‌లో హీరోయిన్‌గా చేసింది. తెలుగులోనూ హీరో తరుణ్‌తో కలిసి ‘నా లవ్ స్టోరీ’ లోను హీరో ఇన్ గా చేసింది.