Tollywood news in telugu
టెక్ మహింద్రా భవనం పై నుంచి దూకి మరీ ఆత్మహత్య చేసుకున్న యువతి !

సికింద్రాబాద్ టెక్ మహేంద్ర కాల్ సెంటర్ భవనం పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వందలాది మంది పని చేసే షిఫ్ట్‌లో 6వ అంతస్తు పైనుంచి దూకి ‘సుస్మిత’ అనే యువతి ఈ దారుణానికి పాల్పడింది.
సుస్మిత ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్త వ్యక్తపరుస్తున్నారు . ఇంటి నుంచి ఉదయం ఆఫీసుకి బయలుదేరిన తరువాత ఏం జరిగిందో తమకు తెలియదని తల్లిదండ్రులు వెల్లడించారు . తమకు ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవని,అలాగే సుస్మితకు ప్రేమ వ్యవహారాలు కూడా లేవని వెల్లడించారు.
మాకు మా కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలున్నాయని తెలిపారు.
పోలీసులు కేసు నమోదుచేసుకోని వివరాలు సేకరిస్తున్నట్టుగా మీడియాకు వెల్లడించారు .