Whiten Teeth : ఇలా చేస్తే ఎలాంటి పళ్ళు ఐన తెల్లగా మారాల్సిందే
Whiten Teeth – ఇపుడు ఉన్న జనరేషన్ లో జంక్ ఫుడ్స్ మరియు అన్ హెల్తీ ఫుడ్స్ తినడం వళ్ళ శరీరంలోనే కాకుండా మన పళ్ళలో కూడా ఎంతో బ్యాక్టీరియా జమచేరి చిగుళ్ల సమస్యలు , పళ్ళు పచ్చగా మారిపోవడం మరియు అనేక దంత సమస్యలు దారి తెస్తున్నాయి. ఎంత పొద్దున్నే లేచి పళ్ళు తోమినప్పటికి పళ్లలో పాచి అలాగే ఉండటం , పళ్ళు పచ్చగానే ఉండటం జరుగుతుంది. దీని వల్ల పంటి సమస్యలు సులువుగా అటాక్ చేస్తాయి. ఈరోజు ఈ సమస్యలు నుంచి ఎలా విముక్తి పొందాలో మనం తెలుసుకుందాం. ఒక్క చిన్న చిట్కా మీ పళ్లలో పాచిని తొలిగించి తెల్లగా ఎటువంటి దుర్వాసన లేకుండా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఎంటో తెలుసుకుందాం పదండి.
* ఈ చిట్కా కోసం కావాల్సిన పదార్ధాలు లవంగం , ఉప్పు , పేస్ట్ , వెల్లులు రెబ్బలు.

* ముందుగా లవంగాలు మిక్సీలో వేసి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేయకుండా పొడి పొడి గా ( గర గర) టైప్ లో చేసుకొని ఒక్క గిన్నె లో వేసుకోండి. ఇలా పొడి పొడిగా చేయడం వలన ఈ లవంగాలు మీ పళ్ళకు స్క్రబ్ లా పనిచేస్తుంది. లవంగం పొడి వేసుకున్న గిన్నెలో తగినంత ఉప్పు , మీరు వాడే టూత్ పేస్ట్ మరియు 2 వెల్లులి రెబ్బలని వేసుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకోండి.
* ఇప్పుడు తయారు చేసుకున్న పేస్ట్ నీ దాదాపు రెండు నుంచి నాలుగు రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ పేస్ట్ నీ రోజు వాడటం వలన మీ పళ్ళ సమస్యలని తొలిగిపోతాయి. పళ్ళు నల్లగా మారిన , పచ్చగా మారిన , దంత సమస్యలు ఎలాంటివి అయిన ఈ చిట్కా పాటించడం తో మీ సమస్యలని తొలిగిపోతాయి.