Teja Sajja Next to be Direct OTT Release : ఓటీటీ రిలీజ్ కి సిద్ధమవుతున్న తేజ సజ్జ సినిమా ? :-

Teja Sajja Next to be Direct OTT Release : తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో గా తన కెరీర్ ని పెంచుకుంటూ పెంచుకుంటూ స్టార్ హీరో అయ్యరు. ఇండస్ట్రీ లో హీరోగా ప్రయత్నాలు చేసేవాళ్ళకి తేజ కెరీర్ గ్రాఫ్ ఒక నిదర్శనం.
అయితే తేజ హీరోగా చేసిన మొదటి సినిమా జాంబి రెడ్డి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని కరోనా సమయం లో అయినా కలెక్షన్ ల వర్షం కురిపించింది. అలాంటి తేజ సజ్జ రెండవ సినిమా అయినా ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ సినిమా మలయాళం లో ఒరిజినల్ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ తెలుగు లో డిజాస్టర్ అయింది.
ఇలా తేజ రెండవ సినిమా ప్లాప్ అవడం తో చాల ఆలోచలతో ఒకటికి రెండు సార్లు కథలు విని మరి అంగీకరిస్తున్నారు. ఆలా తేజ సజ్జ కథను నచ్చి చేసే సినిమాలలో అద్భుతం ఒకటి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాజశేఖర్ గారి రెండవ కూతురు అయినా శివాని రాజశేఖర్ నటించబోతుంది.ఇదే ఆమె డెబ్యూ సినిమా.
ఈ సినిమా మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మాలిక్ రామ్ దర్శకత్వం వహించారు. పోస్టర్స్ తోనే ఈ సినిమా పై మంచి ఆదరణ లభించింది. కాకపోతే ఈ సినిమా థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ లో విడుదలకు సిద్ధం అయిందని చిత్రసీమలో విపరీతంగా టాక్ నడుస్తుంది. ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బృందం 7 కోట్లకి కొన్నారని తెలుస్తుంది.
ఇంకా మిగితా బాషలలో కూడా ఈ సినిమా అమ్మే పనిలో ఉన్నారని తెలుస్తుంది. తెలుగులో మాత్రం హాట్ స్టార్ వాళ్ళకి అమ్మినట్లు తెలుస్తుంది. త్వరలో ఈ వార్త పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయబోతున్నారు. చూడాలి మరి ఈ వార్త పై చిత్రబృందం ఏ విధంగా స్పందించబోతుందో.