Viral Video: బావను టెంపో వాహనానికి కట్టి ఈడ్చుకెళ్లిన బావమరిది …ఇందుకోసమేనట…!

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఓ వ్యక్తి తన బావను టెంపో వాహనానికి కట్టేసి దాదాపుగా అరకిలోమీటర్ దూరం లాక్కెళ్లాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాల్‌కృష్ణ రాథోడ్ అనే వ్యక్తి, తన భార్య శీతల్ రాథోడ్‌తో కలిసి కడోదరాలోని దుర్గానగర్ ప్రాంతంలో జీవిస్తున్నారు. మొన్న శుక్రవారం తప్ప తాగి ఇంటికి చేరుకున్న బాల్‌కృష్ణ తన భార్యతో గొడవకు దిగాడు. ఆ సందర్భంలో ఆమెను తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. భర్త ప్రవర్తన మితిమీరటంతో శీతల్ తన తమ్ముడు అనిల్ చౌహాన్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. అనిల్ కు వృత్తిరీత్యా టెంపో ఉంది. తాగిన మైకంలో ఉన్న తన బావకు ఎంత చెప్పిన గొడవ మనకపోగా.. మరిదినికూడా తిట్టడంతో అనిల్ తన బావను టెంపో కు కట్టి అర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు.
ఇది చుసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనిల్ ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
सूरत में महिला ने अपने भाई के साथ मिलकर
— सुपर कठोर सिंह जी 🇮🇳 (@TheReal_Singh_) February 27, 2021
पति को टेम्पो के पीछे बांधकर आधा किमी तक घसीटा
पत्नी का आरोप – “उसका पति शराब पीकर घर
में मारपीट करता है, इसलिए उसे सबक सिखाया”
😁😁😂😂☺☺😆☺😆😄😝😭#Gujarat #Surat #alertpic.twitter.com/sVV99aRVPu