Thamanna New Beginning turned as Disaster : తమన్నా కొత్త ఆరంభం డిజాస్టర్ గా మారింది :-

Thamanna New Beginning turned as Disaster : హ్యాపీ డేస్ తో కుర్రాల హృదయాలను దోచుకున్న మిల్కీ బ్యూటీ , ఆవారా సినిమాతో మరింత దగ్గరయిపోయింది. ఆ తర్వాత తమన్నా ఏది చేసిన ప్రజలు చూసేవారు , ఆనందించేవారు. ఆలా ఆలా తమన్నా కోసమే సినిమాకి వెళ్ళాలి అనే అంత రేంజ్ కి ఎదిగింది తమన్నా. బాహుబలి తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది .
లాక్ డౌన్ సమయం నుంచి కొత్తగా ఏదైనా చేయాలనీ వెబ్ సిరీస్ చేయడం మొదలుపెట్టి సక్సెస్ కొట్టింది. తీసిన రెండు వెబ్ సిరీస్ ప్రేక్షకులని బాగా అలరించాయి. ఇదిలా ఉండగా తమన్నా కొత్తగా జెమినీ టీవీలోని షో లో హోస్ట్ గా చేయడం మొడ్డలుపెటింది. ఆ షో పేరు మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగు అనే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం గత వారం లో మొదలయింది. ఈ షో లో జడ్జి గా చెఫ్ సంజయ్ తుమ్మ , చలపతిరావు మరియు మహేష్ పడాల చేస్తున్నారు.
అయితే గత వారం లోనే ఎన్టీఆర్ ఎవరో మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈరోజు ఈ రెండు ప్రోగ్రామ్స్ యొక్క టీ.ఆర్.పి రేటింగ్స్ వచ్చాయి. అన్నిట్లో టాప్ గా ఎన్టీఆర్ షో 11. 4 రేటింగ్ సొంతం చేసుకోగా. తమన్నా షో మాత్రం చాల అంటే చాల తక్కువ 4.1 రేటింగ్ సొంతం చేసుకొని డిజాస్టర్ టాక్ దక్కించుకుంది.
దీనిపై నెటిజనులు తమన్నా పై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. పూర్ తమన్నా అని , షో బాలేదు అని రకరకాల కామెంట్స్ తో తమన్నా ని ట్రోల్ చేస్తున్నారు. ప్రజలు చూడకపోతే తమన్నా ని ట్రోల్ చేయడం ఏంటి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏమో, మరుసటి వారంలో తమన్నా షో రేటింగ్ పెరగచ్చు , టాప్ లో రావచ్చేమో ,అంచనా వేయలేము కదా. చూడాలి మరి వచ్చేవారం ఈ రెండు షో లా రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మరి.