EntertinementTollywood news in telugu
స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమైన మిల్కీ బ్యూటీ తమన్నా : Thamanna Special Song on the way

టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ కి మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటినుంచో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అల్లుడు శ్రీను సినిమా నుంచి మొన్న వచ్చిన సరిలేరు నికెవ్వరు సినిమా దాకా స్పెషల్ సాంగ్స్ లో తమన్నా నే కనిపించి కనువిందు చేసింది. ఇదే ప్రస్తుత సక్సెస్ ఫార్ములా ఏమో.
ఇప్పుడు తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమైంది. ఆ స్పెషల్ సాంగ్ మరేదో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న గని అనే సినిమా లోనిది.
ఈ స్పెషల్ సాంగ్ లో తమన్నా , వరుణ్ తేజ్ సరసన చిందులేయబోతుంది. కొడ్తే అనే లైన్ తో మొదలయ్యే ఈ పాట సంక్రాంతి పండుగ కానుకగా 15 వ తేదీ ఉదయం 11:08 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.
చూడాలి మరి ఈ సారి తమన్నా ఎలాంటి స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందో.