ఈ మాయాలోకంలో మాయమవుతున్న మహిళలు … తలపట్టుకుంటున్న పోలీసులు

మహిళల అదృశ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ నగరం తయారైంది. వరుసగా యువతులు,మహిళలు మాయమవుతున్న కేసులు పోలీస్ స్టేషన్లో నమోదవడం అడపిల్లలనుకన్న తల్లిదండ్రులకు వణుకుపుట్టిస్తుంది .
తాజాగా కూకట్పల్లి లో ముగ్గురు మహిళలు, అదేవిదంగా పంజాగుట్ట పరిధిలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమైనట్టు, పోలీసు రికార్డులు చెప్తున్నాయి.
ఖాజీపురా ప్రాంతానికి చెందిన సబీనా బిన్ మహమూద్(22) ఈ నెల 28న మెడికల్ షాప్ కి వెళ్తున్నాని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు. ఎంతవెతికిన దొరకక పోవడంతో పోలీసులకు సబీనా సోదరుడు అబూబకర్ ఫిర్యాదు చేసాడు.
ఇక ఉప్పుగూడ కు చెందిన ఒక గృహిణి అదృశ్యమానట్టు తెలుస్తుంది. ఈ మహిళకు ఒక కుమార్తెకూడా ఉంది.
అదేవిదంగా ఈ నెల 24 న స్రుతి అనే మహిళా తన చిన్నపాపతో కలిసి తిరిగి రాకపోవడంతో స్రుతి తల్లి ఛత్రినా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మహిళలు అత్యవసరం ఐతే తప్ప బయటికి రాకుండ ఉంటె మంచిదని, అలాగే మహిళలు బయటికి వచేటపుడు ఒక మగతోడుతో వెళ్తే ఇలాంటి ఆపదలనుండి తప్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు.
ఈ విదంగా వరుసగా హైదరాబాద్ లో మహిళలు అదృశ్యం అవ్వడాన్ని చేస్తూ ఉంటె మహిళల భద్రతా ఏవిదంగా ఉందొ తెలుస్తుంది.