Tollywood news in telugu
సినీ ఇండస్ట్రీ పూజా హెగ్డే కు ….. తప్పని బాధలు !

puja hegde ప్రస్తుతం టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తున్న బాలీవుడ్ నటి పూజా హెగ్డే, ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులో దువ్వాడ జహానాథం, అరవింద సమేత , మహర్షి , గడ్డలకొండ గణేష్, వంటి హిట్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంది.
ఈ భామ తాజాగా హౌస్ ఫుల్ 4 నినిమాతో హిట్ కొట్టి సంతోషంలో మునిగితేలుతోంది.
తన సినిమా కెరీర్ లోకి అడుగుపెట్టిన రోజుల్లో ‘మొహంజొదారో ‘ సినిమాలో నటించి ఈ అమ్మడు ఫ్లాఫ్ ని తన కతాలో వేసుకుంది.
మొదటి అడుగులోనే ఇలా సినిమా ఫ్లాఫ్ కావడం తనని ఎంతో బాధించిందని మీడియాకి తెలిపింది.
కానీ దక్షణాది ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని, అందువలనే ఇలా ఇప్పుడు సంతోషంగా ఉండగలుగుతున్నానని తన విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది.