జైల్లో అస్వస్థతకు గురైన ఆ హీరోయిన్ !

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం మొత్తం సినిమా ఇండస్ట్రీనే అతలాకుతలం చేసింది. డ్రగ్స్ వ్యవహారం లో శాండిల్ వుడ్ హీరోయిన్స్ రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిన విషయమే.
రాగిణి ని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. ఇపుడు ఈమె కు ఊపిరి ఆడక , బ్యాక్ పెయిన్ రావడంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
గతంలో ఎన్నోసార్లు రాగిణి బెయిల్ కోసం అభ్యర్తించగా కోర్టు తన అభ్యర్థనను అంగీకరించలేదు. ఇలా పలుమార్లు తన అభ్యర్థనను కోర్టు తిరస్కరించడంతో రాగిణి ద్వివేది నిరంతర ఆందోళన చెందుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. కొన్ని సార్లు ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొనేందుకు అవకాశం కల్పించాలని కోరగా అందుకు కూడా న్యాయస్థానం అంగీకరించలేదు.
ఇపుడు తన కి అనారోగ్యం తీవ్రం కావడంతో కేవలం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొనేందుకు అవకాశం ఇచ్చారు. కానీ రాగిణికి ఇపుడు బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది వైద్యులు ఇచ్చే నివేదిక మీద తెలవనుంది.