బ్రెయిన్‌ను డామేజ్ చేసే భయంకర అలవాట్లు ఇవే..
ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం బ్రెయిన్. ఎందుకంటే బ్రెయిన్ అనేది శరీరంలోని ప్రతిఒక్క అణువును కంట్రోల్ చేస్తుంది. మన ప్రతి ఆలోచన, కదలిక బ్రెయిన్ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. బ్రెయిన్‌కి హాని కలిగించే అలవాట్లను పరిశీలిస్తే..
మన బ్రెయిన్‌కి హాని కలగకుండా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయకూడదు.

స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువయ్యాక అర్ధరాత్రి తర్వాతే నిద్రలోకి జారుకుంటున్నారు. అయితే ఈ అలవాటు చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.
వీలైనంతవరకు షుగర్‌ను మానేయాలి. స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి. ఎక్కువ శాతం షుగర్ తింటే మన బ్రెయిన్‌కి హాని కలుగుతుంది.
మన శరీరం అనేది రాత్రిపూట రెస్ట్ తీసుకోవడానికి పగటి పూట కష్టపడటానికి సృష్టించబడింది. కాబట్టి పగటిపూటు ఎక్కువసేపు నిద్రించకూడదు. ఇది బ్రెయిన్‌పై ప్రభావం చూపుతుంది.
మనం పీల్చుకునే ఆక్సిజన్‌ఎక్కువ శాతం బ్రెయిన్‌కి చేరుతుంది. కాబట్టి మన బ్రెయిన్‌కి ఎంత ఫ్రెష్ ఎయిర్ అందిస్తే అంత యాక్టివ్‌గా ఉంటుంది.