Today Telugu News Updates
Bonsai Plant: మొక్కను దొంగిలించినందుకు బొక్కలో వేశారు…
మనం కిడ్నాప్ చేసిన వారిపై కేసు పెట్టడం చూసుకుంటాం… జంతువులను అపహరించాడని యజమానులు కేసులు పెట్టడం కూడా చూస్తుంటాం.. కానీ ఒక ప్రాంతంలో మొక్క పోయిందని కేసు పెట్టాడు..! ఇంతకీ ఆ మొక్క ఏంటి? మొక్కకు ఎంత విలువ ఉంటుంది ? అనేది తెలుసుకుందాం.

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 18లో నివసిస్తున్న రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) వి అప్పారావు కసొరైన బొన్సాయ్ (casuraina bonsai plant) అనే మొక్కను ఎప్పటి నుండో ఇంట్లో పెంచుకుంటున్నాడు.
గత ఆదివారం ఆ డీజీ ఇంట్లో బోన్సాయ్ మొక్కను ఎవరో దొంగలించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు స్ట్రీట్ లో ఉన్న సీసీ ఫోటేజిని పరిశీలించగా… స్థానికంగా ఉండే గొల్లపూడి ప్రసన్నాంజనేయులు, అభిషేక్ దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బోన్సాయ్ మొక్కకి 1.50 లక్షల విలువ ఉంటుందన్ని సమాచారం.