health tips in telugu

throat infection : గొంతు సమస్యలు ఈ రెండు చిట్కాలతో చెక్ పెట్టండి :-

throat infection : ఇపుడు ఉన్న సిట్యుయేషన్ లో 100 లో 90 శాతం మందికి గొంతు సమస్యలు ఉన్నాయి. గొంతులో గరగర అనడం , గొంతులో నుంచి మాటలు సరిగ్గా రాకపోవడం , గొంతు మారిపోవడం. ఇలా అనేక సమస్యలు మనం చూస్తున్నాం. అయితే ఈ గొంతు సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలి అనుకుంటే ఈ రెండు చిట్కాలు పాటిస్తే చాలు.

* పోయి మీద గిన్నె పెట్టీ అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. కాసేపయ్యాక ఈ నీళ్ళలో కాసింత నిమ్మరసం మరియు అర చాంచ తేనె , తగినంత మిరియాలు వేయాలి. ఇప్పుడు ఇవి నీళ్ళలో బాగా మరిగేదక పోయి మీద అలాగే ఉంచండి. మీకు దానిలోని ఘాటు వాసన తగిలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.

ఇప్పుడు ఈ నీళ్ళు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం మరియు సాయంత్రం రెండేసి గ్లాసులు తాగితే దెబ్బకి గొంతు సమస్య మయం. 

* దీనితో పాటు గోరువెచ్చని నీటిలో కడింత ఉప్పు వేసి బాగా కలిపి పుక్కిలించడం చేత గొంతు సమస్య త్వరగా నయమవుతుంది.

ఈ రెండు చిట్కాలను పాటిస్తే మీ గొంతు సమస్య త్వరగా నయమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button